TS Power Employees Strike : విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
17 నుంచి విధులకు రామని వార్నింగ్
TS Power Employees Strike : అసలే ఎండా కాలం విద్యుత్ వినియోగం అత్యంత ఎక్కువగా అవసరం. ఈ తరుణంలో కీలకంగా వ్యవహరించేది ఉద్యోగులే. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించు కోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 17 నుంచి సమ్మెకు సిద్దం కావాలంటూ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.
జేఏసీ నేతలు సాయిబాబు, రత్నాకర్ రావు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. విద్యుత్ సంస్థల(TS Power Employees Strike) యాజమాన్యాలపై నమ్మకం ఉంచామని కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రూపాలలో శాంతియుతంగా నిరసన తెలిపామని కానీ ఇప్పుడు వినిపించుకునే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికే సమ్మె నోటీసు కూడా యాజమాన్యాలకు అందజేశామని స్పష్టం చేశారు.
న్యాయ పరమైన తమ సమస్యల పరిష్కారం కోసం తాము చేపట్టే సమ్మెకు ప్రజలు కూడా అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని సాయిబాబా, రత్నాకర్ రావు కోరారు. ఇదిలా ఉండగా జేఏసీ ఎంప్లాయిస్ ఇచ్చిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు ట్రాన్స్ కో, జెన్ కో ఎండీ ప్రభాకర్ రావు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.
Also Read : ఇంకెంత కాలం లీకుల పర్వం