DK Shivakumar : పవర్ లోకి వస్తే ముస్లింలకు 4 శాతం కోటా
కర్ణాటక ప్రదేశ్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. ముస్లింలకు తీపికబురు చెప్పారు. అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం కోటాను పునరుద్దరిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా మార్చిలో ప్రస్తుతం కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో కోసం నాలుగు శాతం కోటాను రద్దు చేసింది. దీంతో తమను ఆశీర్వదిస్తే తిరిగి పునరుద్దరిస్తామని అన్నారు డీకే శివకుమార్.
వచ్చే మే నెల 10వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం బీజేపీ , కాంగ్రెస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కావాలని ముస్లింలను బీజేపీ సర్కార్ మోసం చేసిందని డీకే శివకుమార్ ఆరోపించారు.
ఓబీసీ కేటగిరీకి చెందిన 2బి వర్గీకరణ కింద ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ ఇప్పుడు రెండు సమాన భాగాలుగా విభజించారు. బెలగావి అసెంబ్లీ సెషన్ లో 2సీ , 2డి రెండు కొత్త రిజర్వేషన్ కేటగిరీల కింద వర్తింప చేశారు. ప్రస్తుతం వొక్కలిగాస్ , లింగాయత్ ల కోటాలో చేర్చనున్నారు.
జాతీయ మీడియాతో మాట్లాడిన శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి చిక్కులు లేకుండా మేం రెండు జాబితాలు లేవనెత్తామన్నారు. బీజేపీ ఇంకా దాని జాబితాను ప్రస్తావించ లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రిజర్వేషన్ సమస్యను రద్దు చేస్తామన్నారు. ఇది మైనార్టీ వర్గాలను పూర్తిగా కాపాడుతుందన్నారు.