కర్ణాటకలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 142 అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చేది మరోసారి తమ ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. ప్రజలు తమను ఆశీర్వదించేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీకి అంత సీన్ లేదన్నారు. 60 స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. పార్టీ చీఫ్ డీకే శివకుమార్ ప్రగల్భాలు పలుకుతున్నారని , కలల్లో తేలి యాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏనాడో కాంగ్రెస్ ను మరిచి పోయారని అన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో మోదీ హవా నడుస్తోందని చెప్పారు. తమను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీకి చేత కాదన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో వేల కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కాదు సరైన పునాది లేదని, విధి విధానాలపై కూడా స్పష్టత లేదన్నారు సీఎం బస్వరాజ్ బొమ్మై. శివకుమార్ తమ అభ్యర్థులను వేడుకుంటున్నారని ఆరోపణలు చేశారు.