PM Modi Inaugurate : ప్రారంభానికి చెన్నై టెర్మిన‌ల్ సిద్దం

ప్రారంభించ‌నున్న పీఎం న‌రేంద్ర మోదీ

PM Modi Inaugurate : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ బిజీ బిజీగా గ‌డ‌ప‌నున్నారు. ద‌క్షిణాదిన ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు శ‌నివారం. తెలంగాణ‌లోని హైద‌రాబాద్ లో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు(PM Modi Inaugurate) చేయ‌నున్నారు. సాయంత్రం త‌మిళ‌నాడులోని చెన్నైలోని ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన కొత్త టెర్మిన‌ల‌న్ ప్రారంభించ‌నున్నారు. ఇందుకు సంబంధించి న‌రేంద్ర మోదీ స్వ‌యంగా ఇవాళ త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

చెన్నై టెర్మిన‌ల్ ను ప్రారంభించ‌డం వ‌ల్ల క‌నెక్టివిటీని పెంచుతుంద‌న్నారు. స్థానిక ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కూడా ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంద‌ని తెలిపారు మోదీ. ఇదిలా ఉండ‌గా టి-2 (ఫేజ్-1) భ‌వ‌నం విమానాశ్ర‌య ప్ర‌యాణీకుల సామ‌ర్థ్యాన్ని సంవ‌త్స‌రానికి 23 మిలియ‌న్ల నుండి 35 మిలియ‌న్ల‌కు పెంచుతుంద‌ని భావిస్తున్నారు.

మొత్తం రూ. 2,437 కోట్ల‌తో ఏర్పాటు చేసిన కొత్త టెర్మిన‌ల్ మొద‌టి ద‌శ పూర్త‌యింది. ఈ టెర్మిన‌ల్ ను అత్యాధునిక హంగుల‌తో తీర్చిదిద్దారు. 2.20 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది. త‌మిళ‌నాడులో రోజు రోజుకు విమాన ట్రాఫిక్ పెరుగుతోంది. దీనిని త‌గ్గించేందుకు కొత్త‌గా అద‌న‌పు టెర్మిన‌ల్ ను ఏర్పాటు చేశారు. ఈ టెర్మిన‌ల్ లో 108 ఇమ్మిగ్రేష‌న్ కౌంట‌ర్లు ఉన్నాయి.

Also Read : ఫ్యాక్ట్ చెకింగ్ వ‌ల్ల భంగం క‌ల‌గ‌దు

Leave A Reply

Your Email Id will not be published!