CJI DY Chandrachud : చ‌ట్టానికి మాన‌వ‌త్వం ఉండాలి – సీజేఐ

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జ‌స్టిస్ చంద్రచూడ్

CJI DY Chandrachud : యావ‌త్ దేశ‌మంతా ప్ర‌స్తుతం న్యాయ వ్య‌వ‌స్థ వైపు చూస్తోంద‌ని ఈ క్ర‌మంలో తీర్పు చెప్పే వాళ్లు, వ‌క‌ల్తా పుచ్చుకునే వాళ్లు చాలా సంయ‌మ‌నంతో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్. చ‌ట్టం అమ‌లు చేయాల‌ని కోరుతున్న సంఘాల వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించారు.

అస్సాం లోని గౌహ‌తి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుక‌ల్లో సీజేఐ పాల్గొని ప్ర‌సంగించారు. చ‌ట్టం అంద‌రి ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా మాన‌వ స్ప‌ర్శ త‌ప్ప‌న‌స‌రి అని స్ప‌ష్టం చేశారు.

స‌మ‌స్య‌ల మూలాల‌ను ప‌రిష్క‌రించేందుకు ఎల్ల‌ప్పుడూ సున్నిత‌త్వంతో ఉప‌యోగించాల‌ని అన్నారు. చ‌ట్టాన్ని తెలివిగా అన్వ‌యించిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు సామాజిక నిర్మాణంపై విశ్వాసం ఉంటుంద‌ని చెప్పారు సీజేఐ(CJI DY Chandrachud). న్యాయ వ్య‌వ‌స్థ చ‌ట్ట‌బ‌ద్ద‌త ప్ర‌జ‌ల నుండి ఆజ్ఞాపించే విశ్వాసంలో ఉంద‌న్నారు. ఆప‌ద‌లో ఉన్న పౌరుల‌కు న్యాయ వ్య‌వ‌స్థ భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు .

చ‌ట్టం అంద‌రి ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగ ప‌డుతుంద‌ని నిర్ధారించేందుకు మాన‌వ స్ప‌ర్శ చాలా అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్. స‌మాన‌త్వం, వైవిధ్యం ప‌ట్ల సానుభూతి, గౌర‌వం కూడా ఉండాల‌న్నారు.

Also Read : గాడ్సేపై ఓవైసీ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!