BRS Suspends : పొంగులేటి..జూపల్లిపై బీఆర్ఎస్ వేటు

బీఆర్ఎస్ నుంచి బహిష్క‌ర‌ణ

BRS Suspends : ఎట్ట‌కేల‌కు భార‌త రాష్ట్ర స‌మితి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త కొంత కాలం నుంచి పార్టీలో ఉంటూనే వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తూ ఇబ్బందిక‌రంగా మారారు మాజీ ఎంపీ, మాజీ మంత్రి.

దీంతో సీరియ‌స్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ(BRS Suspends). పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో పాటు జూప‌ల్లి కృష్ణా రావును పార్టీ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఆ ఇద్ద‌రూ పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించింది. కొత్త‌గూడెం వేదిక‌గా మాజీ ఎంపీ ఆత్మీయ స‌మ్మేళ‌నం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి జూప‌ల్లి కూడా హాజ‌ర‌య్యారు.

సీఎం కేసీఆర్ , ఆయ‌న కుటుంబంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. చివ‌ర‌కు పార్టీకి డ్యామేజ్ అవుతుంద‌ని ఆలోచించిన సీఎం కేసీఆర్ ఆ ఇద్ద‌రిపై వేటు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చివ‌ర‌కు వేటు వేయ‌క త‌ప్ప‌లేదు.

తెలంగాణ ఉద్య‌మ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలో బీఆర్ఎస్ స‌ర్కార్ విఫ‌ల‌మైద‌ని, అవినీతి , అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు క‌నీసం అపాయింట్ మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వడం లేద‌ని మండిప‌డ్డారు ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.

ఈసారి స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. గ‌త మూడేళ్లుగా త‌న‌కు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ జూప‌ల్లి ఆరోపించ‌గా పొంగులేటి మాత్రం బీఆర్ఎస్ ప‌నై పోయింద‌ని ఆరోపించారు. ఇక ఈ ఇద్ద‌రు నేత‌లు ఏ పార్టీలో చేరుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : విశాఖ ఉక్కుపై కేసీఆర్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!