Imran Khan Bajwa : మాజీ ఆర్మీ చీఫ్ వల్లే పదవి కోల్పోయా
పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్
Imran Khan Bajwa : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశారు. అవిశ్వాస తీర్మానం వెనుక పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ కుట్ర దాగి ఉందని ఆరోపించాడు. ఇదే విషయాన్ని తనను గల్ఫ్ దేశ పాలకుడు ఒకరు హెచ్చరించారని వెల్లడించాడు.
పాకిస్తాన్ తెహ్రీక్ – ఇ – ఇన్సాఫ్ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ పీఎంఎల్ – ఎన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. ఇది దేశ చరిత్రలో అత్యంత చెత్త పాలన అంటూ మండిపడ్డారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఒక దేశ ప్రధానమంత్రి కేవలం అవిశ్వాస తీర్మానం ద్వారా వైదొలగడం మొదటిసారి కావడం విశేషం. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కుట్ర చేస్తున్నారంటూ గల్ఫ్ కంట్రీకి చెందిన ఓ దేశాధినేత తనను హెచ్చరించాడని బాంబు పేల్చాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan Bajwa). పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో తీసుకు వచ్చిన అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం కూలి పోయిందన్నారు.
గత ఏడాది ఏప్రిల్ లో నాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ముందు మాజీ ఆర్మీ చీఫ్ బజ్వా గురించి హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండమని సూచించాడని తెలిపారు ఇమ్రాన్ ఖాన్. ఈ కుట్రకు బజ్వా సూత్రధారి అని ఆరోపించాడు.
Also Read : రాజకీయ కళ్లద్దాలు వదిలేయండి – ధన్ ఖర్