Akunuri Murali Jyotirao Phule : మహనీయుడు జ్యోతిబా పూలే
ఆయన జీవితం ఆదర్శప్రాయం
Akunuri Murali Jyotirao Phule : ఇవాళ ప్రముఖ సంఘ సంస్కర్త. ఆడపిల్లలకు చదువు అవసరమని, ఆనాడే బడులు ప్రారంభించిన మహనీయుడు జ్యోతి బా పూలే అని ప్రశంసించారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి(Akunuri Murali). ఇవాళ జ్యోతి బా పూలే జయంతి. ఈ సందర్భంగా మంగళవారం ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. మన సనాతన ఆచారాలకు , భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత మానవుడు జ్యోతి బా పూలే అని కొనియాడారు.
ఆయన ఆనాడే ప్రతి ఒక్కరు చదువు కోవాలని, ముఖ్యంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అన్ని వర్గాలకు చెందిన వారికి విద్య అత్యంత అవసరమని గుర్తించారని పేర్కొన్నారు. ఆ దిశగా అడుగులు వేశారని దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచారని గుర్తు చేసుకున్నారు ఆకునూరి మురళి. ఆడపిల్లలకు చదువు మొదలు పెట్టిన , చరిత్రలో నిలిచి పోయిన అతి గొప్ప త్యాగశీలి , నిజమైన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు.
తన సతీమణి సావిత్రి భాయి పూలేను కూడా విద్యాధికురాలిని చేసిన సంఘ సంస్కర్త పూలే అని తెలిపారు ఆకునూరి మురళి. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతున్నా నేటికీ ఇంకా పేదరికం , కుల వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన చెందారు.
ఈ లోకం ఉన్నంత దాకా జ్యోతి బా పూలే(Akunuri Murali Jyotirao Phule) బతికే ఉంటారని పేర్కొన్నారు.
Also Read : పండుటాల పెన్షన్లు ఆలస్యం -ఆర్ఎస్పీ