Arvind Kejriwal : దేశ వ్యతిరేక శక్తులు ఆప్ కు అడ్డంకులు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్
Arvind Kejriwal : ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యతిరేక శక్తులు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. కేవలం 10 సంవత్సరాల స్వల్ప సమయంలోనే ఆప్ జాతీయ పార్టీ హోదాను పొందిందన్నారు. ఇది మామూలు విషయం కాదన్నారు. అంచెలంచెలుగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే వెళుతుందని చెప్పారు సీఎం.
దీనిని పార్టీ పరంగా అద్భుతమైన విజయంగా పేర్కొన్నారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మార్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు.
అద్భుతమైన అవకాశం మనందరికీ పార్టీ పరంగా దక్కింది. పార్టీకి జాతీయ హోదా దక్కడం వల్ల ఇవాళ దేశమంతటా మనం ప్రజల తరపున మాట్లాడేందుకు, పోరాడేందుకు, ప్రశ్నించేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. జాతీయ హోదాతో పాటు పార్టీపై ప్రధానంగా నాయకులు, కార్యకర్తలపై అదనపు బాధ్యతలు మరింత పెరిగాయని చెప్పారు.
ఆప్ సిద్దాంతం మూడు స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. నిజాయితీ, దేశభక్తి, మానవత్వం అన్నారు. ఆప్ ఎదుగుదలకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Also Read : పరిణీతి చోప్రాపై చద్దా కామెంట్స్