Luizinho Faleiro Quits : టీఎంసీ ఎంపీ ఫలేరో రాజీనామా
గోవా మాజీ సీఎం గా పని చేశారు
Luizinho Faleiro Quits : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి కోలుకోలేని షాక్ ఇచ్చారు గోవా మాజీ సీఎం , ప్రస్తుత రాజ్యసభ ఎంపీ లుయిజిన్హో ఫలేరో. మంగళవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా(Luizinho Faleiro Quits) చేస్తున్నట్లు ప్రకటించారు. 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు లుయిజిన్హో ఫలేరో టీఎంసీ టికెట్ పై పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఆయనకు 71 ఏళ్లు. గోవాలో పార్టీ వ్యవహారాల నుంచి తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం పక్కన పెట్టింది.
ఇదిలా ఉండగా లుయిజిన్హో ఫలేరో గోవా లోని నవేలిమ్ నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నవంబర్ 2021లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఫలీరోను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ఒత్తిడి చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ పై ఫటోర్డా నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు ఫలేరో. దీనిపై తృణమూల్ నాయకత్వం కలత చెందినట్లు సమాచారం.
రాజ్యసభ పదవీ కాలం వచ్చే 2026 సంవత్సరం దాకా ఉన్నప్పటికీ టీఎంసీ హైకమాండ్ తప్పుకోవాలని కోరడంతో గత్యంతరం లేక ఫెలిరో రాజీనామా చేసినట్లు తెలిసింది.
Also Read : దేశ వ్యతిరేక శక్తులు ఆప్ కు అడ్డంకులు