KS Eshwarappa Retires : ఎన్నికల నుంచి తప్పుకుంటున్నా
మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప
KS Eshwarappa Retires : కర్ణాటకలో రాజకీయం మరింత వేడెక్కిన తరుణంలో ఉన్నట్టుండి అధికార పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ 142 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉండగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంకా తమ లిస్టును వెల్లడించలేదు. మరో వైపు మాజీ డిప్యూటీ సీఎం , సీనియర్ బీజేపీ నాయకుడైన కేఎస్ ఈశ్వరప్ప సంచలన ప్రకటన చేశారు.
ఇప్పటికే ఇదే పార్టీకి చెందిన అగ్ర నాయకుడు, మాజీ సీఎం యెడ్యూరప్ప సైతం తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన తరపున తనయుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారంటూ ప్రకటించారు. తాజాగా కేఎస్ ఈశ్వరప్ప కీలక ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. వచ్చే మే నెల 10వ తేదీన పోలింగ్ జరగనుంది అసెంబ్లీకి. మే 13న ఫలితాలు వెల్లడి అవుతాయి. ఇప్పటికే ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
మంగళవారం కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa Retires) సంచలన ప్రకటన చేశారు. కేవలం ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆయన తాను ఎన్నికల రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు.
దీనిపై ఇంకా పార్టీ హైకమాండ్ స్పందించ లేదు. గత 40 ఏళ్లలో పార్టీ నాకు చాలా బాధ్యతలు అప్పగించింది. బూత్ ఇన్ ఛార్జి నుండి రాష్ట్ర పార్టీ చీఫ్ గా పని చేశానని పేర్కొన్నారు. అంతే కాదు రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం గా కూడా అవకాశం ఇచ్చిందన్నారు ఈశ్వరప్ప.
Also Read : టీఎంసీ ఎంపీ ఫలేరో రాజీనామా