RS Praveen Kumar : ధనిక రాష్ట్రంలో జీతాలకు కటకట
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పదే పదే ప్రభుత్వం తమది ధనిక రాష్ట్రమని చెబుతున్నా కనీసం పని చేస్తున్న ఉద్యోగులకు 10వ తేదీ దాటినా ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆలంపూర్ లోని కేకే ఫంక్షన్ హాల్ లో బీఎస్పీ కార్యకర్లల సమావేశంలో ప్రసంగించారు. సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఠంఛనుగా ఒకటో నెలనే జీతం తీసుకుంటున్నారని కానీ పని చేసే వాళ్లకు జీతాలు ఆలస్యం చేయడం దారుణమన్నారు ఆర్ఎస్పీ(RS Praveen Kumar).
ఆయన మీద ఈగ వాలకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు నేటికీ జీతాలు రాలేదని వాపోయారు. 1984లో కాన్షీరాం ఒక్కడే ఉద్యోగం వదిలి పెళ్లి చేసుకోకుండా సైకిల్ పై తిరిగాడని, ఒక మహిళను సీఎం చేశారని అన్నారు. ఎన్నికల సందర్భంగా దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను నమ్మించడం అలవాటుగా మారిందని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రజలను ఓటు బ్యాంకుగా చూస్తున్నపాలకులకు సరైన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మాయావతి కేసీఆర్ లాగా ఫాం హౌస్ లు కట్టుకోలేదని, ప్రత్యేక విమానం కొనుగోలు చేయలేదన్నారు. యూపీలో 7 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ఉన్నటువంటి బంగ్లా మనం కట్టుగోలమా అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
Also Read : బండికి ఊరట కస్టడీ పిటిషన్ కొట్టివేత