Amit Shah : 2024 ఎన్నిక‌ల్లో 300 సీట్లు ప‌క్కా – షా

ప‌వ‌రూ మాదే ప‌ర్సూ మాదే

Amit Shah BJP Voting : కేంద్ర హోం శాఖ మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా(Amit Shah BJP Voting) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో 2024లో జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ దాని మిత్ర‌ప‌క్షాల‌కు క‌లిపి 300 సీట్ల‌కు పైగానే వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు. తిరిగి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కొలువు తీరుతుంద‌న్నారు. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ గా ఇప్ప‌టికే వినుతి కెక్కిన మోదీ సార‌థ్యంలో ప్ర‌మాణ స్వీకారం కూడా చేస్తామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ప్ర‌స్తుతం అమిత్ చంద్ర షా చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌కు అంత సీన్ లేద‌న్నారు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా బీజేపీ ఆక్టోప‌స్ లాగా విస్త‌రించింద‌ని దానిని అడ్డుకునే శ‌క్తి ఈ దేశంలో ఏ పార్టీకి లేద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి. నరేంద్ర దామోద‌ర దాస్ మోదీ చ‌రిత్ర సృష్టించ బోతున్నార‌ని, ఆయ‌న వ‌రుస‌గా మూడోసారి స‌మున్న‌త భార‌త దేశానికి ప్ర‌ధాన‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు.

అస్సాం లోని దిబ్రూగ‌ఢ్ లో మంగ‌ళ‌వారం భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్యాల‌యానికి అమిత్ షా శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈశాన్య రాష్ట్రంలోని 14 లోక్ స‌భ స్థానాల్లో 12 స్థానాలు గెల‌వ‌డం ప‌క్కా అని పేర్కొన్నారు.

Also Read : దేశ వ్య‌తిరేక శ‌క్తులు ఆప్ కు అడ్డంకులు

Leave A Reply

Your Email Id will not be published!