Sachin Pilot : అవినీతీపై యుద్దం ప్రభుత్వంపై ఆగ్రహం
మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దీక్ష
Sachin Pilot : రాజస్థాన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్(Sachin Pilot). ఆయన గత బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ తమ పార్టీ సర్కార్ పై బాణం ఎక్కు పెట్టారు.
దీనిపై తీవ్రంగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏదైనా సమస్య ఉన్నా ప్రజల్లో, మీడియాకు ఎక్క కూడదని చర్చించాలని అనుకుంటే పార్టీకి సంబంధించిన వేదికలపై మాట్లాడాలని సూచించింది.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లో సచిన్ పైలట్ చేపట్టిన నిరాహార దీక్ష కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా సచిన్ పైలట్ చేపట్టిన దీక్షకు సంబంధించి ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తు లేక పోవడం విశేషం.
త్వరలో ఆయన ఏమైనా పార్టీ మారుతారా లేక పార్టీలోనే ఉంటూ అసమ్మతి స్వరం వినిపిస్తారా అన్నది వేచి చూడాలి. తమ పార్టీకి చెందిన సర్కార్ ఉన్నా చర్యలు తీసుకోవడంలో తాత్సారం ఎందుకు అని ప్రశ్నించారు.
మరో వైపు సీఎం పీఠంపై కన్నేసిన సచిన్ పైలట్ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాడని సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే పలుమార్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. చివరకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) జోడో యాత్రలో సీఎం, మాజీ డిప్యూటీ సీఎంలను కలిపే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. మొత్తంగా సచిన్ పైలట్ హాట్ టాపిక్ గా మారడం గమనార్హం.
Also Read : వయనాడులో రాహుల్ హల్ చల్