RS Praveen Kumar : టీఎస్పీఎస్సీ దొంగలు ఎవరో తేల్చండి
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై నిప్పులు చెరిగారు. అసలు దోషులు ఎవరో తేల్చాలని డిమాడ్ చేశారు.
మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని దిల్ షుఖ్ నగర్ లో నిరుద్యో భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు నిరాశకు గురి కావద్దన్నారు. కష్టపడి చదుకుంటే ఎలాంటి ఉద్యోగాన్ని అయినా సాధించ వచ్చని భరోసా ఇచ్చారు.
పాలకుల నిర్లక్ష్యం, ఆశ్రిత పక్షపాతం కారణంగా టీఎస్పీఎస్సీలో పేపర్లు లీక్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దోషులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.
సిట్ ఏర్పాటు వల్ల న్యాయం జరగదని, కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి ఇస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. తనను పదే పదే ఆధారాలు అడుగుతున్నారని తాను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. దమ్ముంటే అమరుల స్థూపం వద్దకు రావాలని లీక్ లకు సంబంధించి తాను వివరాలు ఇస్తానని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : బండికి ఊరట కస్టడీ పిటిషన్ కొట్టివేత
ఈ రోజు #BSP ఆధ్వర్యంలో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగ భరోసా సభ జరిగింది. @TSPSCofficial అసలు దొంగలను ఇంకా ఎందుకు పట్టుకోలేదని పిల్లలడుగుతున్నరు? కమీషన్ లోని గజదొంగలను జైలుకు పంపకుండా ఎన్ని పరీక్షలు పెట్టినా ప్రయోజనం శూన్యం. No exams till the commission is revamped pic.twitter.com/ycrbrJVKJ7
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 11, 2023