Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకంటూ భర్త, పిల్లలు ఉన్నారని కానీ రాహుల్ గాంధీకి మాత్రం మీరే (ప్రజలే) కుటుంబమని అన్నారు. ఏనాడూ తన గురించి, కుటుంబం గురించి ఆలోచించ లేదన్నారు. ఈ దేశం బాగుండాలని కోరుకుంటూ వచ్చారని చెప్పారు.
మంగళవారం తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి మొదటిసారిగా వయనాడు ఎంపీగా అనర్హత వేటు అనంతరం పర్యటించారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో చేపట్టారు. ఎక్కడ చూసినా జనం బ్రహ్మరథం పట్టారు. రాహుల్ గాంధీకి జైకొట్టారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని, దీనినే రాహుల్ గాంధీ నిలదీసి నిగ్గదీశారని చెప్పారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) .
కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్న వాళ్లకు రాహుల్ గాంధీ అర్థం కాడని ఎద్దేవా చేశారు. ఈ దేశం ఆయనలోని నాయకుడిని చూసింది.
దేశ వ్యాప్తంగా 150 రోజుల పాటు కాలికి బలపం కట్టుకుని పాదయాత్ర చేశాడని ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని సూచించారు. ఇవాళ వాళ్లు ఎంపీగా అనర్హత వేటు వేసినా ప్రజల హృదయాల్లోంచి తీసి వేయలేరని అన్నారు.
Also Read : మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం