Sachin Pilot Protest : అవినీతిపై యుద్దం ఆగదు – పైలట్
సర్కార్ పై ఇక ప్రత్యక్ష పోరాటమేనా
Sachin Pilot Big Protest : రాజస్థాన్ సర్కార్ పై స్వపక్షం నుంచే ఆందోళన మొదలు కావడం కలకలం రేపింది. కానీ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ధిక్కార స్వరం వినిపించినా ఇంకా పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోలేదు. అయితే తాను గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని గతంలో బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు సీఎం చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
మంగళవారం ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. అయితే పార్టీ మాత్రం ప్రజల్లోకి, మీడియాకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించింది. ఏదైనా అనుమానాలు ఉంటే పార్టీకి సంబంధించి వేదికలపై మాట్లాడాలని సూచించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు సచిన్ పైలట్(Sachin Pilot Big Protest) .
అవినీతి, అక్రమాలపై తన యుద్దం ఇప్పటితో ఆగదని ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. జైపూర్ లోని షహీద్ స్మారక్ వద్ద ఆయన ఈ దీక్ష చేపట్టారు. గత బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎందుకు ఉపేక్షించాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా స్వంత పార్టీపైనే యుద్దం ప్రకటించిన సచిన్ పైలట్ తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో వైపు త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.
Also Read : మోడీ మోడీ’గా మారి పోయిన ‘నాటు నాటు’