EX CP Bhaskar Rao : చామ్ రాజ్ పేట నుంచి మాజీ సీపీ
బరిలోకి దింపిన భారతీయ జనతా పార్టీ
EX CP Bhaskar Rao : కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. వచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 142 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం 189 సీట్లకు తమ పార్టీ తరపున క్యాండిడేట్స్ ను ఖరారు చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఈ జాబితాలో బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ గా పని చేసిన భాస్కర్ రావుకు(EX CP Bhaskar Rao) టికెట్ కేటాయించింది. ఆయన చామ్ రాజ్ పేట నుంచి బీజేపీ నుంచి బరిలో ఉండనున్నారను. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఒక రోజు ముందు మాజీ సీపీ నగరంలోని శ్రీ దొడ్డ గణపతి ఆలయంలో పూజలు చేశారు.
ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా మాజీ సీపీ మీడియాతో మాట్లాడారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ కేంద్రాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని, ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని తాను ప్రచారం చేస్తానని చెప్పారు మాజీ సీపీ భాస్కర్ రావు. ఇదిలా ఉండగా రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో బెలగావి నార్త్ కు చెందిన సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అనిల్ బెనకే మద్దతుదారులు నిరసన తెలిపారు.
Also Read : యెడ్యూరప్ప విధేయుడికి నో ఛాన్స్