CT Ravi : ప్రయోగాలకు బీజేపీ పెద్దపీట – సీటీ రవి
కన్నడ నాట 52 మంది కొత్త వారికి చోటు
CT Ravi : కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 189 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో 52 మంది సిట్టింగ్ లకు మంగళం పాడింది. కొత్త వారికి అవకాశం ఇచ్చింది. మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మే 10న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడుతాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ 142 సీట్లను ఖరారు చేసింది. ఇక ఈసారి లిస్టులో ఊహించని రీతిలో మాజీ డిప్యూటీ సీఎం , మాజీ సీఎం యెడ్యూరప్ప కు విధేయుడిగా పేరొందిన లక్ష్మణ్ సవాది కి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
కాగా అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు లేక పోవడంతో ఖంగుతున్న ఎమ్మెల్యేలంతా నిరసన గళం వినిపించారు. కొందరు బీజేపీని వీడేందుకు మొగ్గు చూపుతున్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ సీటీ రవి స్పందించారు(CT Ravi).
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎల్లప్పుడూ కొత్త వారిని ప్రోత్సహిస్తుందని అది మిగతా పార్టీలకంటే భిన్నంగా ఉంటుందని చెప్పారు. పార్టీ కోసం పని చేసే వారికే ఈసారి టికెట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎవరు వెళ్లినా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.
Also Read : యెడ్యూరప్ప విధేయుడికి నో ఛాన్స్