Rahul Gandhi Nitish Kumar : రాహుల్ నితీష్ కుమార్ భేటీ

ప్ర‌తిప‌క్షాల ఏక‌తో ఓ ముంద‌డుగు

Rahul Gandhi Nitish Kumar : దేశంలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏకం కావ‌డంపై ఫోక‌స్ పెట్టాయి. బుధ‌వారం కీల‌క‌మైన భేటీ జ‌ర‌గ‌డం ఇందుకు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi Nitish Kumar) తో బీహార్ సీఎం నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ , జేడీయూ చీఫ్ రాజీవ్ రంజ‌న్ సింగ్ , ఆర్జేడీ ఎంపీ మ‌నోజ్ కుమార్ ఝా , కాంగ్రెస్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్ హాజ‌ర‌య్యారు. వీరి ములాఖ‌త్ సంచ‌ల‌నం క‌లిగించింది ప్ర‌స్తుత రాజ‌కీయాలలో.

ఐక్య ప్ర‌తిప‌క్ష ఫ్రంట్ ను క‌లిపే మ‌రో ప్ర‌య‌త్నంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ , జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ , జేడీయూ , ఆర్జేడీ అగ్ర‌నేత‌లు స‌మావేశం కావ‌డం పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సంద‌ర్బంగా స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడారు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఇది చారిత్రాత్మ‌క స‌మావేశం అని, రాబోయే ఎన్నిక‌ల కోసం అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకం చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. దీనిని ఓ ముంద‌డుగుగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని, దేశం ప‌ట్ల ప్ర‌తిప‌క్ష దృష్టిని మ‌రింత పెంపొందిస్తుద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ వీలైన‌న్ని పార్టీల‌ను ఏక‌తాటిపైకి తీసుకు వ‌చ్చి క‌లిసి ప‌ని చేయాల‌నే ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ప‌క్ష నాయ‌కులు ప్ర‌జ‌ల గొంతును మ‌రింత వినిపించేందుకు క‌లిసి న‌డిచేందుకు ప్ర‌తిజ్ఞ చేశార‌ని తెలిపింది కాంగ్రెస్ పార్టీ.

Also Read : అభ్య‌ర్థుల లిస్టుపై షాతో న‌డ్డా భేటీ

Leave A Reply

Your Email Id will not be published!