Mallikarjun Kharge : ప్రతిపక్షాల సమావేశం చరిత్రాత్మకం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ పాలనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను, శక్తులను ఏకం చేయడమే తమ పార్టీ ముందున్న లక్ష్యమన్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు వెళతామని చెప్పారు.
బుధవారం న్యూ ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ , ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా , కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సమావేశం అయ్యారు. వీరి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సమావేశం అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల సమావేశం ఓ ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టి వేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.
రాబోయే ఎన్నికల్లో వీలైనన్ని అన్ని పార్టీలను కలుపుకుని తాము ముందుకు వెళతామని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే. ప్రజల తరపున వాయిస్ వినిపించేందుకు తామంతా ఒక్కటిగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు మల్లికార్జున్ ఖర్గే. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం..దేశాన్ని కాపాడుతామని పేర్కొన్నారు.
Also Read : రాహుల్ నితీష్ కుమార్ భేటీ