Maheshwar Reddy Joins : ఏలేటి షాక్ బీజేపీలోకి జంప్

కేసీఆర్ పాల‌నే నా పంతం

Maheshwar Reddy Joins : అంతా అనుకున్న‌ట్టుగానే జంపింగ్ లు మొద‌ల‌య్యాయి తెలంగాణ‌లో. ఎవ‌రు ఎప్పుడు ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. నిన్న‌టి దాకా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారోన‌న్న ఉత్కంఠ‌కు తెర దించారు. గురువారం ఎంచ‌క్కా భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. మోదీ విధానాలు న‌చ్చి తాను చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో నియంత పాల‌న సాగిస్తున్న కేసీఆర్ ను గ‌ద్దె దించే స‌త్తా కాంగ్రెస్ కు లేద‌ని కేవ‌లం మోదీకి మాత్ర‌మే ఉంద‌న్నారు ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి. ఇవాళ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఏలేటి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్ , బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ , సీనియ‌ర్ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ , సంగ‌ప్ప ఉన్నారు.

పార్టీ కండువా క‌ప్పుకున్న అనంత‌రం ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి(Maheshwar Reddy Joins)  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ దాని గురించి ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు బి టీంగా ప‌ని చేస్తోందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. కేసీఆర్ ను ప‌డ‌గొట్టాలంటే ద‌మ్మున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు . ఇదిలా ఉండ‌గా ఏలేటి చేరిక‌తో బీజేపికి మ‌రింత బ‌లం చేకూరుతుంద‌న్నారు బండి సంజ‌య్.

Also Read : 29 మంది సీఎంలు కోటీశ్వ‌రులు

Leave A Reply

Your Email Id will not be published!