Devendra Fadnavis : బల పరీక్ష లేకుండానే ఉద్దవ్ రాజీనామా
తిరిగి ఎలా నియమస్తారని ప్రశ్న
Devendra Fadnavis : మరాఠా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి మాజీ సీఎం , శివసేన యుబిటి చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగారు. ఆయనను ఎవరూ తొలగించ లేదని చెప్పారు. తనంతకు తానుగా సీఎం పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపించారు ఫడ్నవీస్. తన పార్టీ బీజేపీ కూడా సీఎం ఏక్ నాథ్ షిండేతో కలిసి పని చేస్తుందని స్పష్టం చేశారు.
ఉద్దవ్ ఠాక్రే గత ఏడాది జూన్ లో బల పరీక్ష ఎదుర్కోకుండానే స్వయంగా మహారాష్ట్ర సీఎం పదవి కి రాజీనామా చేశారని అన్నారు. గురువారం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. అయితే ఆయనంతకు ఆయనే వైదొలిగిగే ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఎలా పునరుద్దరిస్తుందని ప్రశ్నించారు.
సీఎం షిండేతో కలిసి పని చేస్తుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ తన పార్టీని కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం.
మరాఠీ న్యూస్ ఛానల్ ముంబై టాక్ నిర్వహించిన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) మాట్లాడారు. మార్చి మధ్యలో మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభానికి సంబంధించి శివసేనకు చెందిన ఉద్దవ్ ఠాక్రే , షిండే వర్గాల క్రాస్ పిటిషన్ల బ్యాచ్ పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Also Read : లలిత్ మోడీపై సుప్రీం సీరియస్