Prakash Ambedkar : ద‌ళిత బంధు ప్ర‌శంస‌నీయం

ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ కామెంట్స్

Prakash Ambedkar  : డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు, ప్ర‌ముఖ ర‌చ‌యిత ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అంబేద్క‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ హైద‌రాబాద్ లో 125 అడుగుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్ర‌హం రాష్ట్రానికే కాదు దేశానికి త‌ల‌మానికంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ తో క‌లిసి ప్ర‌కాశ్ అంబేద్క‌ర్(Prakash Ambedkar) విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ ప్ర‌సంగించారు.

బాబా సాహెబ్ అంబేద్క‌ర్ జీవితాంతం బ‌హుజ‌నుల అభ్యున్న‌తి కోసం ప‌ని చేశాడ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉన్నార‌ని, దేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా ఎన్నో కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చార‌ని చెప్పారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల సాధ‌న కోసం రాష్ట్ర స‌ర్కార్ కృషి చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్.

రాష్ట్ర ప్ర‌భుత్వం ద‌ళితుల‌, అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం ద‌ళిత బంధు పేరుతో సంక్షేమ ప‌థ‌కాన్ని తీసుకు రావ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు. ఇది దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేద‌న్నారు ప్ర‌కాశ్ అంబేద్క‌ర్(Prakash Ambedkar). పాల‌క వ‌ర్గాలు ప్ర‌స్తుతం మ‌తం, కులం, ప్రాంతం పేరుతో స‌మాజాన్ని చీల్చే ప‌నిలో ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : ఎర్ర‌కోట‌పై ఎగిరే జెండా మ‌న‌దే – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!