NCP Contest : కర్ణాటక ఎన్నికల బరిలో ఎన్సీపీ
40 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం
NCP Contest : నిన్నటి దాకా కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నశరద్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ(NCP Contest) ఉన్నట్టుండి ప్లేటు మార్చింది. వచ్చే మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 224 సీట్లకు గాను కనీసం రాష్ట్రంలో 40 సీట్లలో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ చీఫ్ శరద్ పవార్ సారథ్యంలో కీలక సమావేశం జరిగింది. మరో వైపు కన్నడ నాటు అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నడుస్తోంది.
ఓ వైపు ఎంఐఎం, ఆప్ , జేడీఎస్ కూడా ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. మొత్తంగా ఈ పార్టీలతో పాటు ఎన్సీపీ కూడా ఎన్నికల్లో పోటీకి దిగితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. మొత్తం ఓటు బ్యాంకులో హిందుత్వ ఓటు బ్యాంక్ బీజేపీకి వెళితే లౌకిక వాదంతో ముందుకు వెళుతున్న కాంగ్రెస్ కు ఓట్లు రావడం కష్టమే. ఇక కన్నడ నాట లింగాయత్ సామాజిక వర్గం కీలకంగా మారనుంది. వారు ఏ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.
ఇక ప్రతిపక్షాల ఐక్యత పేరుతో శరద్ పవార్ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయిన ఒక రోజు తర్వాత ఎన్సీపీ కన్నడ(NCP Contest) నాట పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. ప్రతిపక్ష ఐక్యతకు భారీ దెబ్బ. ఈ నిర్ణయం ఇటీవల ఎన్సీపీ తన జాతీయ హోదాను కోల్పోవడానికి ముడి పడి ఉందని సమాచారం. ఒకవేళ పోటీ చేయక పోతే హోదా రద్దయ్యే ప్రమాదం ఉంది. అందుకే బరిలో ఉండాలని నిర్ణయించినట్లు టాక్. ఏది ఏమైనా పవర్ లోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్ కు ఇది రుచించని వార్తే.
Also Read : రూ. 1.34 లక్షల కోట్ల డీఎంకే ఫైల్స్