Akhilesh Yadav Yogi : యోగి ఈ నేరస్థుల సంగతేంటి
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav Yogi : యూపీలో మాటల యుద్దం కొసాగుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నేరస్థులు ఇంకా బతికే ఉన్నారని ఆరోపించారు. 2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ ను హత్య చేసింది బీజేపీ వాళ్లేనని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మాజీ ఎంపీ ఆతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను , అతడి సహచరుడిని కాల్చి చంపిన ఒక రోజు తర్వాత ఎస్పీ చీఫ్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కులానికి చెందిన వారంతా ఇంకా సజీవంగా ఉన్నారని , నేరాలు చేస్తూ ముఠాలు నడుపుతున్నారని ఆరోపించారు అఖిలేష్ యాదవ్. అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ బూటకమని ఆరోపించారు. అనేక కేసులు ఉన్న నేరస్థుల జాబితాను ప్రకటించారు. కుల్దీప్ సింగ్ సెంగార్ పై 28 కేసులు, వారణాసికి చెందిన బ్రిజేష్ సింగ్ పై 106 కేసులు , జాన్ పూర్ కు చెందిన ధనంజయ్ సింగ్ పై 46 కేసులు, రాజా భయా పై 31 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
వీరంతా యోగి కులానికి చెందిన వారంటూ ఆరోపించారు ఎస్పీ చీఫ్. వారంతా తప్పించుకు తిరగడం లేదు. తమ కులానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నారని భరోసాతో ఉన్నారని ఆవేదన చెందారు . నేరాలు చేయడం, ముఠాలను నడపడం, హత్యలు చేయడం, మానభంగాలకు పాల్పడడం వీరి నిత్యం దిన చర్య అని ఆరోపించారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav Yogi) . వీరంతా బీజేపీకి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.
Also Read : ఓవైసీ..అఖిలేష్ పై బీజేపీ ఫైర్