MP Sanjay Singh : సమన్లు డోంట్ కేర్ – సంజయ్
ఢిల్లీ సీఎంకు సమన్లపై ఎంపీ
MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ సీబీఐ చేసింది. ఏప్రిల్ 16న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఇది కావాలని చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.
ఢిల్లీలో ఏం చేయలేక పోయారు. పంజాబ్ లో చతికిల పడ్డారు. ఇవాళ ఈసీ తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది. ఢిల్లీ మహానగర ఎన్నికల్లో తోక జాడించారు. ఇవన్నీ కేంద్రంలోని బీజేపీకి, పీఎం మోదీకి కంటగింపుగా మారాయని ఆరోపించారు ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీకి చెందిన నల్ల ధనం అంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనేని సంచలన ఆరోపణలు అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ చేశారని తెలిపారు.
దీనిని జీర్ణించు కోలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంపై కక్ష పెంచుకున్నారని, ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు సంజయ్ సింగ్. సమన్లు, జైళ్లు, కేసులు ఆప్ కు కొత్త కాదని స్పష్టం చేశారు. తమకు న్యాయ స్థానాలే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని బుగ్గిపాలు చేస్తున్న నరేంద్ర మోదీకి రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నారని కానీ తాము ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
Also Read : గాంధీ కంటే అంబేద్కర్ కు గౌరవం