Atiq Ahmed Ashraf Killed : గ్యాంగ్ స్టర్స్ అతిక్..అష్రఫ్ ఖతం
నేరస్థుల గుండెల్లో యోగి దడ
Atiq Ahmed Ashraf Killed : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది యూపీకి చెందిన మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ ఆతిక్ అహ్మద్. తాజాగా ఆయన కొడుకు అసద్ అహ్మద్ తో పాటు సహచరుడు గులాంను ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. ఇదే క్రమంలో తనను చంపేస్తారని అనుమానం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఆతిక్ అహ్మద్. అంతా అనుకున్నట్టుగానే పోలీసుల సమక్షంలోనే కాల్చి చంపబడ్డాడు. సోదరుడు మరో గ్యాంగ్ స్టార్ కూడా ఖతమయ్యాడు.
ఉత్తర ప్రదేశ్ లో సీఎంగా యోగి ఆదిత్యానాథ్ కొలువు తీరాక నేరస్థులు, గ్యాంగ్ స్టర్లు, మాఫియాల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశాడు. వేయికి పైగా ఎన్ కౌంటర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక అతిక్ అహ్మద్ నేరాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఆయన నేర సామ్రాజ్యం వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. మరికొందరిని చంపేలా చేసింది. అతిక్ అహ్మద్ ను ప్రోత్సహించిన చరిత్ర సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీదే. యోగి వచ్చాక సీన్ మారింది. బడ్జెట్ సమావేశాల సందర్బంగా జరిగిన అసెంబ్లీలో సీఎం సంచలన ప్రకటన చేశారు. మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ ప్రకటించాడు.
బుల్ డోజర్లను ప్రయోగించాడు. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు. అతిక్ అహ్మద్ తో పాటు సోదరుడు అష్రఫ్ అహ్మద్ కాల్చి చంపబడ్డారు. శనివారం రాత్రి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో వైద్య పరీక్షల కోసం తీసుకు వెళుతుండగా ఖతమయ్యారు. రెండు రోజుల కిందట యూపీలోని ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ కూడా చని పోయాడు.
గుంపులో నుంచి ఎవరో కాల్చి చంపారంటూ గ్యాంగ్ స్టర్ న్యాయవాది విజయ్ మిశ్రా తెలిపాడు. కాల్చి వేసిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారంతా విలేకరుల ముసుగులో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.
Also Read : అతిక్..అష్రఫ్ కాల్చివేతపై విచారణ