CM Yogi : అతిక్..అష్ర‌ఫ్ కాల్చివేత‌పై విచార‌ణ

ప్ర‌క‌టించిన సీఎం యోగి ఆదిత్యానాథ్

CM Yogi : యూపీలో క‌ర‌డు గ‌ట్టిన నేర‌స్థులు మాజీ ఎంపీ అతిక్ అహ్మ‌ద్, సోద‌రుడు అష్ర‌ఫ్ అహ్మ‌ద్ లు శ‌నివారం రాత్రి ప్ర‌యాగ్ రాజ్ లో వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం వెళుతుండ‌గా గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల చేతిలో కాల్చి చంప‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న పోలీసుల స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం విశేషం. వారిద్ద‌రూ హ‌తం కావ‌డంతో రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi) అసెంబ్లీ సాక్షిగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాఫియాను మ‌ట్టిపాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

రెండు రోజుల కింద‌ట న్యాయ‌వాది హ‌త్య కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ , గ్యాంగ్ స్ట‌ర్ అతిక్ అహ్మ‌ద్ త‌న‌యుడు అస‌ద్ అహ్మ‌ద్, స‌హ‌చ‌రుడు గులాంను యూపీలోని ఝాన్సీ వ‌ద్ద ఎన్ కౌంట‌ర్ లో హ‌త‌మ‌య్యారు. ఈ త‌రుణంలో జైళ్లోనే ఉన్న అతిక్ అహ్మ‌ద్ , అష్ర‌ఫ్ అహ్మ‌ద్ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌ను చంపినా స‌రే త‌మ పిల్ల‌లు, మ‌హిళ‌ల‌ను చంప వ‌ద్ద‌ని కోరాడు. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. త‌న‌ను జైల్లోనే మ‌ట్టు పెడ‌తారంటూ వాపోయాడు.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల చేతుల్లో ఖ‌త‌మ‌య్యారంటూ పోలీసులు వెల్ల‌డించారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో ఓ కానిస్టేబుల్, జ‌ర్న‌లిస్ట్ గాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్న‌త స్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు. ద‌ర్యాప్తు చేసేందుకు సీఎం ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన న్యాయ క‌మిష‌న్ ను ఏర్పాటు చేశారు. యూపీలో 144 సెక్ష‌న్ ను విధించారు.

Also Read : గ్యాంగ్ స్ట‌ర్స్ అతిక్..అష్ర‌ఫ్ ఖ‌తం

Leave A Reply

Your Email Id will not be published!