Asaduddin Owaisi : ఖాకీల సమక్షంలోనే చంపేస్తారా
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎలా
Asaduddin Owaisi : యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గ్యాంగ్ స్టర్స్ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , సోదరుడు అష్రఫ్ అహ్మద్ శనివారం రాత్రి కాల్చి చంపబడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు విలేకరుల ముసుగులో వచ్చారు. లైవ్ లో మాట్లాడుతుండగానే కాల్పులకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ కాలిస్టేబుల్ తో పాటు ఓ జర్నలిస్ట్ గాయపడ్డారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతిక్ అహ్మద్ గతంలో సమాజ్ వాది పార్టీ, బీఎస్పీకి ప్రాతినిధ్యం వహించాడు. రెండు రోజుల కిందట కొడుకు అసద్ అహ్మద్ తో పాటు సహాయకుడు గులాం ఎన్ కౌంటర్ లో ఖతమయ్యారు.
తాజాగా చోటు చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) . ట్విట్టర్ వేదికగా ఎంపీ స్పందించారు. ఇప్పటికే అసద్ ఎన్ కౌంటర్ పై సీరియస్ కామెంట్స్ చేసిన ఓవైసీ మరోసారి యూపీ సర్కార్ పై, ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ పై నిప్పులు చెరిగాడు. ఖాకీల సమక్షంలో ఎలా చంపుతారంటూ ప్రశ్నించారు.
ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిందంటూ ఆరోపించారు. అతిక్ అహ్మద్ , సోదరుడు అష్రఫ్ అహ్మద్ లు పోలీసు కస్టడీలో ఉండగానే చంపబడ్డారు. చేతులకు సంకెళ్లు వేశారు. ఎక్కడికి వెళ్లకుండా చేశారని వాపోయారు. జేఎస్ఆర్ అంటూ నినాదాలు లేవనెత్తారు. వారిద్దరి హత్య యూపీలో లా అండ్ ఆర్డర్ విఫలమైదని చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ రాజ్ ను జరుపుకునే వారు ఈ హత్యకు సమాన బాధ్యత వహిస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఓవైసీ.
Also Read : గ్యాంగ్ స్టర్ల హత్య జర్నలిస్టులకు భద్రత