Former Army Chief : పుల్వామా ఘటనకు మోదీదే బాధ్యత
భారత ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి
Former Army Chief : భారత ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి (Former Army Chief) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. పుల్వామా ఉగ్ర దాడి ఘటనలో ఆనాడు భారత జవాన్లు 40 మంది మరణించారు. దీనికి ప్రధాన కారణం మోదీ, కేంద్రమేనని ఆరోపించారు. జాతీయ భద్రతా సలహాదారు మార్గ నిర్దేశం చేసే పీఎం నేతృత్వంలోని ప్రభుత్వం దాని నుండి తప్పించుకోలేక పోతోందని స్పష్టం చేశారు.
పుల్వామా ఘటనను బహిర్గతం చేయవద్దంటూ మోదీని కోరినట్లు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెల్లడించడంపై శంకర్ రాయ్ చౌదరి స్పందించారు. ఆయన టెలిగ్రాఫ్ తో మాట్లాడారు.
పుల్వామా దాడికి దారి తీసిన సైనికులను విమానంలో సరిహద్దులకు తరలించాలన్న డిమాండ్ ను కేంద్ర సర్కార్ అంగీకరిచ లేదని సత్య పాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట జాతీయ రహదారి లో 78 వాహనాల్లో 2,500 మంది సైనికులను తీసుకెళ్లారు.
ఇంత పెద్ద కాన్యాయ్ ఉండాల్సింది కాదని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అభిప్రాయపడ్డారు. విమానాల్లో తరలించి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదన్నారు. వైఫల్యాలకు వారసులు అంటూ ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత ఆర్మీ మాజీ చీఫ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read : నోరు పారేసుకుంటే చర్యలు తప్పవు