Rajnath Singh : స‌రిహ‌ద్దు ఉద్రిక్తం నిఘా అత్య‌వ‌స‌రం

జ‌ర భ‌ద్ర‌మ‌న్న రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh : చైనా స‌రిహ‌ద్దు వెంట గ‌స్తీ కొన‌సాగించాల‌ని, ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు దేశ రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ భ‌ద్ర‌త ప‌ట్ల ప్ర‌భుత్వం ప్ర‌యారిటీ ఇస్తుంద‌న్నారు. నిఘాను మ‌రింత క‌ఠిన‌త‌రం చేయాల‌న్నారు. అనేక అనిశ్చితి కార‌ణంగా భ‌విష్య‌త్తులో యుద్దాలు అనూహ్యంగా ఉంటాయాని హెచ్చ‌రించారు.

పీఎల్ఏ ద‌ళాల మోహరింపు దృష్ట్యా ఉత్త‌ర సెక్టార్ లో ప‌రిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందు వ‌ల్ల చైనాతో వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వెంట ప‌టిష్ట భ‌ద్ర‌త ఉంచాల‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న ఆర్మీని కోరారు.

ఆర్మీ క‌మాండ‌ర్ల కాన్ఫ‌రెన్స్ లో సింగ్ త‌న ప్ర‌సంగంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సాయుధ బ‌ల‌గాలు ప్ర‌పంచ వ్యాప్తంగా భౌగోళిక‌, రాజ‌కీయ మార్పుల‌ను గ‌మ‌నించాల‌ని సూచించారు. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ఉంటే ఎలా నిఘా పెంచాలో తెలుస్తుంద‌న్నారు రాజ్ నాథ్ సింగ్.

ఉత్త‌ర సెక్టార్ లో పీఎల్ఏ ద‌ళాల‌ను మోహ‌రించ‌డం వ‌ల్ల ప‌రిస్థితి ఉద్రికంగా ఉంద‌న్నారు. మ‌న సాయుధ బ‌ల‌గాలు , భార‌త సైన్యం నిరంతరం గ‌స్తీపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. తూర్పు ల‌డ‌ఖ్ లో మూడేళ్లుగా కొన‌సాగుతున్న స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్య‌లు ప్రాదాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : యూత్ కాంగ్రెస్ చీఫ్ వేధింపుల ప‌ర్వం

Leave A Reply

Your Email Id will not be published!