CJI DY Chandrachud : నన్ను ట్రోల్ చేస్తారేమో – సీజేఐ
జస్టిస్ చంద్రచూడ్ షాకింగ్ కామెంట్స్
CJI DY Chandrachud : స్వలింగ సంపర్క వివాహాలకు సంబంధించి చట్ట బద్దత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యం లోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వరుసగా ఇది మూడో రోజు కావడం విశేషం. ఈ కేసులో తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
ఈ సందర్భంగా గతంలో కీలకమైన తీర్పులు వెలువరించడం, ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వాన్ని ఏకి పారేయడంతో హిందూత్వ సంస్థలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్ర చూడ్(CJI DY Chandrachud) ను ట్రోల్ తో హోరెత్తించారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు.
దీనిని సీజేఐ తేలికగా తీసుకున్నారు. సమాజంలో ఇవన్నీ మామూలేనని పేర్కొన్నారు. ఏ అంశానికి సంబంధించిన తీర్పు అయినా అందరినీ సంతోషానికి గురి చేయలేదని స్పష్టం చేశారు ధనంజయ చంద్రచూడ్. ఇదిలా ఉండగా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం స్వలింగ సంపర్క వివాహాల చట్ట బద్దతపై తాను చేసిన వ్యాఖ్యలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా మందికి నచ్చక పోవచ్చని, దీంతో మరోసారి తాను ట్రోల్ కు గురవుతానేమోనని పేర్కొన్నారు. ప్రస్తుతం సీజేఐ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వివాహానికి సంబంధించి అభివృద్ది చెందుతున్న భావనను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read : అమృత పాల్ సింగ్ భార్య పట్టివేత