TREIRB JOBS : తెలంగాణ గురుకులాల్లో పోస్టులు ఇవే
ఆన్ లైన్ లో దరఖాస్తులు షురూ
TREIRB JOBS : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 868 పోస్టులు డిగ్రీ కాలేజీల్లో భర్తీ(TREIRB JOBS) చేయనుంది.
ఆయా పోస్టులకు సంబంధించి పీజీ, లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. యూజీసీ నెట్ , స్లెట్ లో ఉత్తీర్ణులై ఉండాలి. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల వరకు ఉండాలి. అయితే రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంటుందని సంస్థ ప్రకటించింది.
వీటి కోసం దరఖాస్తు చేసుకునే గడువు మే 17 డెడ్ లైన్ విధించింది. జనరల్ అభ్యర్థులు రూ. 1200, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు రూ. 600 చెల్లించాలి. పోస్టుల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39 ఉండగా లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. తెలుగు 55, ఇంగ్లీష్ 69, మ్యాథ్స్ 62, స్టాటిస్టిక్స్ 58, ఫిజిక్స్ 46, కెమిస్ట్రీ 69, బోటనీ 38 , జువాలజీ 58 పోస్టులు ఉన్నాయి.
కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జియాలజీ 6, బయో కెమిస్ట్రీ 3, బయో టెక్నాలజీ 2, హిస్టరీ 28 , ఆర్థిక శాస్త్రం 25, రాజనీతి శాస్త్రం 27, కామర్స్ 93, జర్నలిజం 2, సైకాలజీ లో 6 పోస్టులు ఉన్నాయి. మైక్రో బయాలజీలో 17, పరిపాలనా శాస్త్రం 9, సోషియాలజీ లో 7 , బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
వీటితో పాటు 2008 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనుంది సంస్థ. పై విధంగానే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మూడెంచల పద్దతి ద్వారా ఎంపిక చేస్తారు. ఫిజికల్ డైరెక్టర్ 34 పోస్టులు ఉండగా లైబ్రేరియన్ 50, తెలుగు లో 225 , హిందీ లో 20, ఉర్దూలో 50, ఇంగ్లీష్ లో 230 , మ్యాథ్స్ లో 324 , ఫిజిక్స్ లో 205 పోస్టులు ఉన్నాయి. ఫిజిక్స్ లో 205, కెమిస్ట్రీలో 207 , బోటనీ లో 204, జువాలజీలో 199, హిస్టరీలో 7, ఎకనామిక్స్ లో 82, కామర్స్ లో 87, సివిక్స్ లో 84 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసేందుకు మే 17 డెడ్ లైన్.
Also Read : త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీ