Viveka Murder Case : హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
సోమవారం దాకా అరెస్ట్ చేయొద్దు
Viveka Murder Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 25 వరకు ఎంపీని అరెస్ట్ చేయొద్దంటూ ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కీలక సూచనలు చేసింది. ఎంపీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. విచారణ చేపట్టే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది కోర్టు.
ఈ కేసుకు సంబంధించి ఎంపీకి ఊరట ఇవ్వడంపై సీరియస్ గా స్పందించింది దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత. హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఇదే సమయంలో సోమవారం దాకా వెసులుబాటు కల్పించింది ఎంపీ అవినాష్ రెడ్డికి. అప్పటి దాకా అతడిని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది సుప్రీం.
ఇదిలా ఉండగా వివేకా హత్య కేసుకు సంబంధించి వరుసగా మూడో రోజు కూడా సీబీఐ విచారణ చేపట్టింది. మొత్తంగా ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చేసుకుంటుండడం విశేషం.
Also Read : యూట్యూబర్ పై ప్రతీకారం ఎందుకు