Delhi CM : ఢిల్లీ పోలీస్ స్కాం బాధ్య‌త ఎల్జీదే

ఎల్జీ విన‌య్ స‌క్సేనాకు ఆప్ డిమాండ్

Delhi CM : ఢిల్లీ పోలీసులకు సంబంధించి స్కాం చోటు చేసుకుంద‌ని, ఇందులో రూ. 350 కోట్ల మేర చోటు చేసుకుంద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దీనిపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసింది. ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. అవినీతి జ‌రిగిన విష‌యాన్ని కప్పి పుచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఇందుకు సంబంధించి ప‌దే ప‌దే త‌మ‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వినయ్ కుమార్ స‌క్సేనా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించింది. శుక్ర‌వారం ఆప్ సీరియ‌స్ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ కుంభ కోణానికి పూర్తిగా ఎల్జీనే బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేసింది. పైకి నీతి సూత్రాలు వ‌ల్లె వేస్తున్న స‌క్సేనా చ‌రిత్ర అంతా అవినీతేనంటూ ఆరోపించింది ఆప్.

ఇదిలా ఉండ‌గా ఎల్జీగా కొలువు తీరాక ఢిల్లీ ఆప్ స‌ర్కార్ కు ప‌డ‌డం లేదు. నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొన‌సాగుతోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా స్పందించారు ఎల్జీ. దీని దెబ్బ‌కు ప‌లువురు ఇరుక్కున్నారు. ఇప్ప‌టికే మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు ప్ర‌స్తుత సీఎం కేజ్రీవాల్ కూడా సీబీఐ ఎదుట హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ పోలీస్ స్కాంలో దోషులు జైలుకు వెళ‌తారా అని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Delhi CM) ప్ర‌శ్నించారు.

Also Read : అంకితా ద‌త్తాకు షోకాజ్ నోటీసు

Leave A Reply

Your Email Id will not be published!