Ankitha Dutta : అంకితా దత్తాకు షోకాజ్ నోటీసు
రేపో మాపో పార్టీ నుంచి సస్పెండ్
Ankitha Dutta : తనపై జాతీయ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ శారీరక, మానసిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అస్సాం యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ అంకితా దత్తా(Ankitha Dutta) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఇదే విషయాన్ని తాను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి కూడా ఫిర్యాదు చేశానని కానీ ఫలితం కనిపించ లేదని వాపోయారు. మరో వైపు అంకితా దత్తా ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ బీవీపై అస్సాం పోలీసు సీఐడీ కేసు నమోదు చేయనుందని సమాచారం.
ఇదే క్రమంలో తీవ్ర ఆరోపణలు చేసిన అంకితా దత్తాకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇది కలకలం రేపింది. ఓ వైపు బాధితురాలు తాను వేధింపులకు గురయ్యానని ఆరోపిస్తుంటే విచారణకు కమిటీని వేయాల్సింది పోయి నోటీసులు ఎలా ఇస్తారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఆమెను(Ankitha Dutta) సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. అయితే అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంకితా దత్తా చేసిన ఆరోపణలను కొట్టి పారేసింది. ఇదంతా రాజకీయ ప్రేరేపితమైనదిగా పేర్కొంది. పార్టీని, నాయకులను అప్రతిష్టపాలు చేయడంలో భాగంగానే ఆమె ఈ ఆరోపణలు చేసిందని తెలిపింది.
ఇదిలా ఉండగా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఈ సమస్య కాంగ్రెస్ పార్టీకి చెందినదని పేర్కొన్నారు. ఆమె రాహుల్ కు ఫిర్యాదు చేసింది. ఒకవేళ నాకు గనుక చెప్పి ఉంటే ఇప్పటికే చర్యలు తీసుకునే వాడినని చెప్పారు.
Also Read : సిబ్బందికి క్షమాపణ చెప్పిన సిఇఓ