Owaisi Yogi : హంత‌కుల వెనుక ఉన్న‌దెవ‌రు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ

Owaisi Yogi : ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ(Owaisi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ్యాంగ్ స్ట‌ర్స్ అతిక్ అహ్మ‌ద్ , అష్ర‌ఫ్ అహ్మ‌ద్ ల కాల్పుల‌పై తీవ్రంగా స్పందించారు. ఇప్ప‌టికే ఆయ‌న యూపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. తాము గాడ్సే అడుగు జాడ‌ల్లో న‌డుస్తామ‌ని , హంత‌కుల‌ను హెచ్చ‌రించారు. శుక్ర‌వారం ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హ‌త్య చేసిన వారిని టెర్ర‌రిస్టులుగా పేర్కొన్నారు ఎంపీ.

ఇదే అంశంపై యూపీలోని అధికార బీజేపీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు ఓవైసీ. ఆ రాష్ట్రం చ‌ట్ట విరుద్ద కార్య‌క‌లాపాల నివార‌ణ చ‌ట్టాన్ని ఎందుకు ఉప‌యోగించడం లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త‌మ‌ను చంపిన వారిపై ఎందుకు ఉపా ప్ర‌యోగించ లేద‌న్నారు. హంత‌కుల‌కు ఆటోమేటిక్ ఆయుధాలు ఎవ‌రు ఇచ్చారు.

వారికి రూ. 8 ల‌క్ష‌ల విలువైన ఆయుధాలు ఎవ‌రు స‌మ‌కూర్చార‌ని ప్ర‌శ్నించారు. వారు తీవ్రవాదులు, గాడ్సే అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్నార‌ని ఆరోపించారు. వారిని ఇక‌నైనా ఆపాలి. లేక‌పోతే ఇంకొంద‌రిని చంపుతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా తాను యూపీని సంద‌ర్శిస్తాన‌ని చెప్పారు ఓవైసీ.

ఇదిలా ఉండ‌గా ఓవైసీ, సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi) ల మ‌ధ్య మాట‌ల యుద్దం గ‌త కొంత కాలం నుంచీ కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇప్ప‌టి దాకా నేర‌స్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు సీఎం. బుల్డోజ‌ర్లు ప్ర‌యోగిస్తూ, కేసులు న‌మోదు చేస్తూ, జైళ్ల‌లోకి పంపిస్తున్నారు. దీంతో మాఫియా డాన్లు యోగి పేరు చెబితే జంకుతున్నారు.

Also Read : మ‌ణిపూర్ బీజేపీలో సంక్షోభం అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!