Amitabh Yash Comment : అత‌డో ‘సింగం’ నేర‌స్థుల‌కు భ‌యం

అమితాబ్ య‌ష్ టార్చ్ బేర‌ర్

Amitabh Yash Comment : యూపీలో ప్ర‌స్తుతం సీఎం యోగి ఆదిత్యానాథ్ తో పాటు మ‌రొక‌రి పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ అమితాబ్ య‌ష్. నేరస్థులు, మాఫియా డాన్ ల పాలిట సింహ స్వ‌ప్నంగా మారాడు.

ఒక ర‌కంగా చెప్పాలంటే గ‌తంలో త‌మిళంలో ఖాకీల నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా సింగం సెన్సేష‌న్. ఇప్పుడు స‌ద‌రు ఈ పోలీస్ ఆఫీస‌ర్ ను మ‌రో సింగంగా పిలుచుకుంటున్నారు. ఒక్క‌సారి చేతిలోకి తుపాకి వ‌చ్చిందంటే చాలు నేర‌స్థులు ప‌రార్ కావ‌డమో లేక ఎన్ కౌంట‌ర్ లో ప్రాణాలు కోల్పోవ‌డమో జ‌రుగుతోంది.

పేరు మోసిన అతిక్ అహ్మ‌ద్ ఫ్యామిలీ ఇత‌డి పేరు వింటేనే వ‌ణుకేది. ఇటీవ‌లే అతిక్ అహ్మ‌ద్ , అశ్ర‌ఫ్ అహ్మ‌ద్, అస‌ద్ అహ్మ‌ద్ లు కాల్చి చంప‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం యూపీలో టార్చ్ బేర‌ర్ గా మారాడు అమితాబ్ య‌ష్. రోజు రోజుకు త‌న ప‌ట్టు మ‌రింత పెంచుకున్నాడు.

ఒక‌ప్పుడు ఎస్టీఎఫ్ చీఫ్ గా ప‌ని చేశాడు. ఒక్క‌సారి క‌మిట్ అయితే ఇక ఎంత‌టి నేర‌స్థుడైనా లింగి పోవాల్సిందే. లేదంటే ఖ‌తం కావాల్సిందే. మాఫియా డాన్ సోద‌రి ప్ర‌యాగ్ రాజ్ లో అమితాబ్ య‌ష్(Amitabh Yash Comment) పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అత‌డిని మోస్ట్ డేంజ‌రస్ పోలీస్ ఆఫీస‌ర్ గా పేర్కొంది.

ఇంత‌లా భ‌య‌పెడుతున్న అమితాబ్ య‌ష్ ఎవ‌రు. త‌మ‌కు సెక్యూరిటీ క‌ల్పించాల‌ని, య‌ష్ నుంచి ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని అతిక్ అహ్మ‌ద్ భార్య సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. అమితాబ్ య‌ష్ 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్. య‌ష్ స్వ‌స్థ‌లం బీహార్ లోని భోజ్ పూర్ జిల్లా వాసి.

తండ్రి కూడా ఐపీఎస్ ఆఫీస‌ర్. చిన్న‌ప్ప‌టి నుంచి నేర‌స్థులు, పోలీసుల వ్య‌వ‌హార శైలిని ద‌గ్గ‌రుండి ప‌రిశీలించే వాడు. ఢిల్లీలో చ‌దువు పూర్తి చేశాడు. యూపీఎస్సీ ప‌రీక్ష రాసి ఐపీఎస్ కు ఎంపిక‌య్యాడు. కెప్టెన్ గా సంత్ క‌బీర్ న‌గ‌ర్ లో ఎస్పీగా ఉన్నాడు. బ‌రాబంకి మహారాజ్ గంజ్ , హ‌ర్దోయి, జ‌లౌన్ , స‌హ‌రాన్ పూర్ , సీతాపూర్ , బులంద్ ష‌హ‌ర్ , నోయిడా, కాన్పూర్ ల‌లో ప‌ని చేశాడు.

మే 2007లో యూపీలో మాయావ‌తి స‌ర్కార్ ఏర్ప‌డిన స‌మ‌యంలో ఎస్ఎస్పీ ఎస్టీఎఫ్ చీఫ్ గా నియ‌మితుల‌య్యాడు అమితాబ్ య‌ష్‌. బుందేల్ ఖండ్ అడ‌వుల్లో దాదువాకు వ్య‌తిరేకంగా ప్రచారం చేశాడు. నెల‌ల త‌ర‌బ‌డి అడ‌వుల్లో ఉన్నాడు. గ‌జ దొంగ‌ల‌ను హ‌త‌మార్చాడు.

ఇదే స‌మ‌యంలో ఎస్టీఎఫ్ టీంపై థోకియా దాడి చేయ‌డంతో బిగ్ షాక్. ఆ త‌ర్వాత థోకియాను లేపేశాడు య‌ష్. చిత్ర‌కూట్ అడవుల్లో దొపిడీ దొంగ‌ల‌ను త‌రిమి కొట్టిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంది. ఎస్టీఎఫ్ నుండి నిష్క్ర‌మించాక అమితాబ్ య‌ష్ నోయిడా, కాన్పూర్ డీఐజీగా ఉన్నాడు. చిత్ర‌కూట్ , గోర‌ఖ్ పూర్ ఐజీగా ప‌ని చేశాడు.

2017లో యూపీలో యోగి వ‌చ్చాక ఎస్టీఎఫ్ ఐజీగా ఎంపిక‌య్యాడు. 2021లో ఏడీజీగా ప‌దోన్న‌తి పొందాడు. 5 ఏళ్ల 10 నెల‌ల కాలంలో నేర‌స్థుల పాలిట సింహ స్వ‌ప్నంగా మారాడు. త‌న‌కెరీర్ లో 150 మందికి పైగా దుర్మార్గుల భ‌ర‌తం ప‌ట్టాడు. యూపీకి చెందిన షూట‌ర్స్ ముఖ్తార్ , అతిక్ గ్యాంగ్ షూట‌ర్స్ ను లేపేశాడు.

వికాస్ దూబేను కూడా చంపాడ‌ని టాక్. అంతే కాదు ఆయుష్ అడ్మిష‌న్ స్కామ్, టెట్ పేప‌ర్ లీక్ కేసు, ప‌శు సంవ‌ర్ద‌క శాఖ స్కామ్ , ఇలా కుంభ‌కోణాల‌ను బ‌య‌ట పెట్ట‌డంలో అమితాబ్ య‌ష్(Amitabh Yash) హ‌స్తం ఉంది. ఇలాంటి వాడు మ‌న‌కు కూడా కావాల‌ని కోరుకుంటున్నారు దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు.

Also Read : ముప్పు తిప్ప‌లు పెట్టిన ‘సింగ్’

 

Leave A Reply

Your Email Id will not be published!