Amrit Pal Singh Surrender : ముప్పు తిప్ప‌లు పెట్టిన ‘సింగ్’

37 రోజులు 10 న‌గ‌రాలు 9 అరెస్ట్ లు

Amrit Pal Singh Surrender : సిక్కు బోధ‌కుడు, ఖ‌లిస్తాన్ వేర్పాటు వాద నాయ‌కుడు అమృత పాల్ సింగ్ ఎట్ట‌కేల‌కు లొంగి పోయాడు. అత‌డు పంజాబ్ పోలీసుల నుంచి రెండుసార్లు త‌ప్పించుకున్నాడు. 37 రోజుల త‌ర్వాత అరెస్ట్ అయ్యాడు. 10 న‌గ‌రాలు 9 అరెస్ట్ లు జ‌రిగాయి.

పంజాబ్ పోలీసుల‌తో క‌లిసి ఢిల్లీ పోలీసులు సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. మార్చి 18న జ‌లంధ‌ర్ లో , మార్చి 28న హోషియార్ పూర్ లో వాహ‌నాల‌ను మార్చ‌డం ద్వారా త‌ప్పించుకున్నాడు అమృత పాల్ సింగ్(Amrit Pal Singh). ఏప్రిల్ 23న ఆదివారం త‌నంత‌కు తానుగా పంజాబ్ లోని మోగాలో లొంగి పోయాడు. దీంతో సింగ్ ను అసోంలోని దిబ్రూగ‌ఢ్ లోని సెంట్రల్ జైలుకు త‌ర‌లించారు.

పోలీసులు మార్చి 18న అమృత పాల్ సింగ్ , అత‌డి సంస్థ వారిస్ పంజాబ్ దే స‌భ్యుల‌పై అణిచివేత ప్రారంభించారు. ఫిబ్ర‌వ‌రిలో అజ్నాలా పోలీస్ స్టేష‌న్ పై దాడి చేసిన బోధ‌కుల మ‌ద్ద‌తు దారుల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా ఈ అణిచివేత జ‌రిగింది.

ఇదే స‌మ‌యంలో త‌న‌కు మెంట‌ర్ గా ఉన్న పాప‌ల్ ప్రీత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు అమృత పాల్ సింగ్ భార్య లండ‌న్ కు పారి పోయేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకోగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో సింగ్ కు అన్ని వైపులా దారి మూసుకునేలా చేశారు.

పోలీస్ సిబ్బందిపై హ‌త్యా య‌త్నం , దాడితో స‌హా అనేక నేరారోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ తో ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయ‌ని భార‌త నిఘా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉండ‌గా సిక్కుల గురువు అకల్ త‌ఖ్త్ జ‌తేదార్ అమృత పాల్ సింగ్(Amrit Pal Singh Surrender) ను లొంగి పోవాల‌ని కోరినా ఫ‌లితం లేక పోయింది. పోలీసులు అత‌డి కోసం జ‌ల్లెడ ప‌ట్టారు. హ‌ర్యానా, రాజ‌స్థాన్ , యూపీల‌లో ద‌ర్యాప్తు సాగించారు. ఏప్రిల్ 15న సింగ్ స‌న్నిహితుడు జోగా సింగ్ ను అరెస్ట్ చేయడంతో ఆచూకీ ల‌భించింది. మొత్తంగా అమృత పాల్ సింగ్ ముప్పు తిప్ప‌లు పెట్టాడు.

Also Read : లొంగి పోయాడా అరెస్ట్ అయ్యాడా

Leave A Reply

Your Email Id will not be published!