YS Sharmila : బీఆర్ఎస్ పై యుద్దం కేసీఆర్ పై పోరాటం

అరెస్ట్ ల‌కు ..కేసుల‌కు భ‌య‌ప‌డ‌ను

వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సీరియ‌స్ కామెంట్స్ చేశారు. నిన్న అరెస్ట్ అయిన ఆమె మంగ‌ళ‌వారం బెయిల్ పై విడుద‌లైంది. అనంత‌రం మీడియాతో వైఎస్ ష‌ర్మిల మాట్లాడారు. బీఆర్ఎస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కేందుకు సీఎం కేసీఆర్ ఎంత నీచంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు.

తాను సిట్ వ‌ద్ద‌కు వెళ్లాల‌ని అనుకుంటే కావాల‌ని పోలీసులు దాడి చేసి గాయ‌ప‌రిచార‌ని ఆరోపించారు. త‌న‌ను తాను ర‌క్షించు కునేందుకే ప్ర‌య‌త్నం చేశాన‌ని , ఇలా చేయ‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. అరెస్ట్ వారెంట్ లేకుండా త‌న‌ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

నా ఇంటి ద‌గ్గ‌ర‌, పార్టీ ఆఫీసు ద‌గ్గ‌ర ఉండ‌రాద‌న్న కోర్టు ఆర్డ‌ర్ ను బేఖాత‌ర్ చేస్తూ కేసీఆర్ పోలీసులు కేసీఆర్ కు తొత్తుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ అక్ర‌మ అరెస్ట్ లకు , బెదిరింపుల‌కు భ‌య‌ప‌డన‌ని స్ప‌ష్టం చేశారు. తాను రాజ‌శేఖ‌ర్ రెడ్డి బిడ్డ‌న‌ని , ప్ర‌జా క్షేత్రంలో నియంత పాల‌న‌పై పోరాడుతాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల‌కు చేస్తున్న అన్యాయంపై ప్ర‌శ్నిస్తూనే ఉంటాన‌ని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your Email Id will not be published!