ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆప్ అభ్యర్థికి లైన్ క్లియర్ అయ్యింది. షెల్లీ ఒబెరాయ్ ప్రస్తుతం ఢిల్లీ మేయర్ గా పని చేస్తున్నారు. స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించక పోవడం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని శిఖా రాయ్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మరోసారి మేయర్ గా ఎన్నికైన షెల్లీ ఒబేరాయ్ ని ప్రత్యేకంగా అభినందించారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కష్టపడి పని చేయాలని, ఆప్ కు పేరు తీసుకు రావాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంచనాలు అందుకోవాలని సూచించారు సీఎం.
ఈసారి ఢిల్లీ మేయర్ గా షెల్లీ ఒబేరాయ్ , డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన అలీకి ప్రత్యకంగా అభినందనలు తెలిపారు అరవింద్ కేజ్రీవాల్. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత జాతీయ రాజధాని కొత్త మేయర్ ను పొందుతుంది. మేయర్ పదవికి రొటేషనల్ ప్రాతిపదికన ఐదు ఒకే సంవత్సర కాలాలు ఉంటాయి. మొదటి ఏడాది మహిళలకు, రెండోది ఓపెన్ కేటగిరీకి, మూడోది రిజర్వ్ డ్ కేటగిరీకి , మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ చేస్తారు.