Gaddar Sharmila : కొలువుల కోసం ఆగదు పోరాటం
నిప్పులు చెరిగిన గద్దర్..వైఎస్ షర్మిల
Gaddar Sharmila : రాష్ట్రంలో లక్షా 90 వేలకు పైగా కొలువులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. నీళ్లు , నిధులు, నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమే పదవులు వచ్చాయి.
కానీ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలకు ఏ ఒక్క పదవి రాలేదు..పోస్టు దక్కలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ ప్రభుత్వం భర్తీ చేసే జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ రవ్వంతైనా స్పందించడం లేదని ధ్వజమెత్తారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.
టీ – సేవ్ ఫోరం పేరుతో హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంలో అసలు దొంగలు ఎవరో ఇప్పటి దాకా తేల్చ లేదన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. సోయి లేకుండా ఫామ్ హౌస్ కే సీఎం పరిమితమైతే కొలువులు ఎట్లా భర్తీ చేస్తారంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా హాజరైన ప్రజా యుద్ద నౌక గద్దర్ తన గాత్రంతో మరోసారి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానామా అంటూ పాడారు. పోరాడితేనే కొలువులు వస్తాయని అన్నారు. కలిసి కట్టుగా ఒకే వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : షర్మిల ఖండించినా నోరు మెదపని జగన్