CM KCR : నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు – కేసీఆర్
సంచలన ప్రకటన చేసిన ముఖ్యమంత్రి
CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల నగారా మోగించారు. ఎన్నికలు జరిగేందుకు కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని హెచ్చరించారు. కేసీఆర్(CM KCR) చేసిన ప్రకటన కలకలం రేపింది. ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగే ఛాన్స్ ఉంది. గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భారత రాష్ట్ర సమితి తొలి ఆవిర్భావ సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఇళ్లల్లో కాదు ఉండాల్సింది ప్రజల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ఎవరు గీత దాటినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీఎం. ఎవరెవరు ఏమేం చేస్తున్నారనేది తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. కాదు కూడదని అనుకుంటే పార్టీ నుంచి వెళ్లి పోవచ్చని షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
వ్యక్తిగత దూషణలు, విమర్శలు, ఆరోపణలు మానుకోవాలని సూచించారు. గతంలో 88 సీట్లు వచ్చాయి. ఈసారి 100 సీట్లకు పైగా రావాలని స్పష్టం చేశారు కేసీఆర్. ఎవరికి టికెట్ ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో తనకు బాగా తెలుసని చెప్పారు సీఎం(CM KCR). ఇక నుంచి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు.
Also Read : బీఆర్ఎస్ కే పట్టం నేనే సీఎం – కేసీఆర్