Komatireddy Venkat Reddy : బీ ఫామ్ నా ఇంటికే వస్తుంది
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన భారత రాష్ట్ర సమితిని , సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. నల్లగొండలో జరిగిన నిరుద్యోగ గర్జనలో పాల్గొన్నారు. ఒకప్పుడు స్కూటర్ లేనోడు ఇప్పుడు 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఎత్తేస్తామని , దాని స్థానంలో స్కూల్ ఏర్పాటుస్తానని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy).
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వెంకట్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు. జానా రెడ్డి, వీహెచ్ , ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగారంలో ఇంధ్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. బీఫామ్ నా ఇంటికే వస్తుందన్నారు.
నల్లగొండలో పోటీ చేసేది తానేనని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). దళిత బంధులో 3 లక్షలు తీసుకున్న ఆ ఎమ్మెల్యేల జాబితా ఏదో ప్రకటించాలని సీఎం కేసీఆర్ ను సవాల్ చేశారు. ఉద్యమ కారుడి పేరుతో మంత్రి పదవి కొట్టేసిన నిరంజన్ రెడ్డికి 400 ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఎంపీ. దోచు కోవడం, దాచు కోవడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు.
Also Read : తలైవా నీకిది తగునా – కొడాలి నాని