TTD EO Dharma Reddy : విస్తృత ఏర్పాట్లు మెరుగైన సేవలు
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు
TTD EO Dharma Reddy : అసలే వేసవి కాలం. సెలవులు ప్రకటించడంతో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తిరుమలకు భక్తులు. ఆ వేంకటేశ్వరుడి చల్లని చూపు కోసం కోట్లాది మంది వేచి చూడటం అలవాటే. జీవితంలో ఒక్కసారైనా తిరుమలను దర్శించు కోవాలనేది భక్తుల కోరిక.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పాలక మండలి ఫోకస్ పెట్టింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy) . భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతోందని , వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎక్కడా పొరపాటు జరగకుండా , భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలతో పాటు నిర్దేశించిన సమయానికి స్వామి వారి దర్శనం కలిగేలా చేస్తామన్నారు ఈవో ధర్మారెడ్డి.
మే 1 నుంచి జూలై 15 వరకు యాత్రీకులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తారని తెలిపారు. ప్రతి ఏటా ఈ సంఖ్య ఎక్కువవుతోందని దీనిని దృష్టిలో పెట్టుకుని తాము వసతి కల్పనపై ఫోకస్ పెట్టామని చెప్పారు ఈవో ధర్మారెడ్డి. క్యూ లైన్లు, వైకుంఠం కాంప్లెక్స్ లు, కంపార్ట్ మెంట్లలో తాగు నీరు, అన్న ప్రసాదం , ఇతర సేవలకు ఆటంకం లేకుండా చూడాలన్నారు.
Also Read : ఎన్నికలకు సిద్దం బాబుతో స్నేహం