PM Modi Mann Ki Baat : బేటీ బ‌చావో బేటీ ప‌డావో – మోదీ

హ‌ర్యానాలో ప్ర‌భావం చూపింది

PM Modi Mann Ki Baat : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బేటీ బ‌చావో బేటీ ప‌డావో కార్య‌క్ర‌మం ప‌లు రాష్ట్రాల‌ను ప్ర‌భావం చూపింద‌ని తెలిపారు. అక్టోబ‌ర్ 3, 2014లో మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం మొద‌లైంది. ఇవాల్టితో వందోది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా కేంద్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

సెల్ఫీ విత్ డాట‌ర్ , బేటీ బ‌చావో బేటీ ప‌డావో నినాదం హ‌ర్యానాలో లింగ నిస్ప‌త్తిని మెరుగు ప‌ర్చ‌డంలో స‌హాయ ప‌డింద‌న్నారు మోదీ. సునీల్ జ‌గ్లాన్ ను స‌త్క‌రించారు. ఒకరి జీవితంలో ఒక కూతురు ప్రాముఖ్య‌త త‌న ప్ర‌చారం ద్వారా తెర‌పైకి వ‌స్తుంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi Mann Ki Baat).

సునీల్ జ‌గ్లాన్ జీ ప్ర‌భావాన్ని చూపారు. ఎందుకంటే ఇంత‌కు ముందు హ‌ర్యానాలో చాలా చ‌ర్చ‌లు జ‌రిగేలా చేశార‌న్నారు మోదీ. నేను హ‌ర్యానా నుంచే బేటీ బ‌చావో బేటీ ప‌డావో ప్ర‌చారాన్ని ప్రారంభించాను. సెల్ఫీ విత్ డాట‌ర్ ప్ర‌చారం త‌న‌ను చాలా ప్ర‌భావితం చేసింద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి. సెల్ఫీ విత్ డాట‌ర్ ప్రచారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భావితం చేసింద‌ని తెలిపారు.

మ‌న్ కీ బాత్(Mann Ki Baat) కార్య‌క్ర‌మం మ‌హిళ‌లు, యువ‌కులు, రైతులు వంటి బ‌హుళ సామాజిక వ‌ర్గాల‌ను ఉద్దేశించి ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి కీల‌క స్తంభంగా మారిందన్నారు ప్ర‌ధాన‌మంత్రి. 22 భార‌తీయ భాష‌లు, 29 మాండ‌లికాల‌తో పాటు ఫ్రెంచ్ , చైనీస్ , ఇండోనేషియ‌న్ , టిబెట‌న్ , బ‌ర్మీస్ , బ‌లూచి, అర‌బిక్ , ప‌ష్ణు, ప‌ర్షియ‌న‌న్ , ద‌రి, స్వాహిల‌తో స‌హా 11 విదేశీ భాష‌ల‌లో ప్ర‌సారం అవుతోంది.

Also Read : విస్తృత ఏర్పాట్లు మెరుగైన సేవ‌లు

Leave A Reply

Your Email Id will not be published!