CM Pinaray Vijayan : సంఘ్ పరివార్ పై విజయన్ కన్నెర్ర
కేరళ కథ మూవీపై సీఎం సీరియస్
CM Pinaray Vijayan : భారతీయ జనతా పార్టీకి చెందిన సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ పై నిప్పులు చెరిగారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ది కేరళ స్టోరీ పేరుతో వచ్చిన సినిమాపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే చెప్పాలని ఇలా ఏకపక్షంగా ఎలా తీస్తారంటూ ప్రశ్నించారు.
మత పరమైన సెంటిమెంట్స్ ను రెచ్చగొట్టేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పినరయ్ విజయన్(CM Pinaray Vijayan). ప్రపంచం ముందు రాష్ట్రాన్ని కించ పర్చడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కానీ దానిని తాము సమర్తవంతంగా తిప్పి కొడతామని చెప్పారు సీఎం.
లవ్ జిహాద్ అంశాన్ని లేవనెత్తడం ద్వారా రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరిస్తున్న సంఘ్ పరివార్ ప్రచారానికి శ్రీకారం చుట్టిందంటూ ఆరోపించారు. ది కేరళ స్టోరీ చిత్ర నిర్మాతలపై కేరళ సీఎం విజయన్ ఆదివారం నిప్పులు ఫైర్ అయ్యారు. కోర్టులు, దర్యాప్తు సంస్థలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా అభ్యంతరం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు పినరయ్ విజయన్.
కేరళలో రాజకీయంగా లబ్ది పొందేందుకు ఆర్ఎస్ఎస్ ఇలాంటి కుట్రకు తెర లేపిందంటూ ఆరోపించారు. కలిసికట్టుగా ఉన్న మనుషుల మధ్య చిచ్చు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాము సంఘ్ పరివార్ అసత్య ప్రచారాన్ని తిప్పి కొడతామని హెచ్చరించారు సీఎం.
Also Read : మోసం బీజేపీ నైజం – ప్రియాంక గాంధీ