DGCA Show Cause Notice : ఎయిర్ ఇండియా సీఇఓకు నోటీసు

జారీ చేసిన ఏవియేష‌న్ రెగ్యులేష‌న్ రెగ్యులేట‌ర్

DGCA Show Cause Notice : ఎయిర్ ఇండియాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. దుబాయ్ – ఢిల్లీ విమాన ఘ‌ట‌న‌కు సంబంధించి ఎయిర్ ఇండియా సిఈవో , సేఫ్టీ హెడ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ). కాక్ పిట్ లోని మ‌హిళా స్నేహితురాలిని పైల‌ట్ అనుమ‌తించ‌డంపై విమానంలో ప్ర‌యాణం చేస్తున్న ప్ర‌యాణీకులతో పాటు క్యాబిన్ క్రూ సిబ్బంది డీజీసీఏకి ఫిర్యాదు చేశారు.

ఈ నోటీసుపై ఎయిర్ ఇండియా నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ఇదిలా ఉండ‌గా ఫిబ్ర‌వ‌రి 27న దుబాయ్ – ఢిల్లీ విమానంలో ప్ర‌యాణిస్తున్న పైలట్ స్నేహితురాలిని కాక్ పిట్ లోకి రానిచ్చాడు. ఘ‌ట‌న‌ను నివేదించ‌డంలో ఎయిర్ లైన్స్ లోపానికి కార‌ణ‌మైన ఎయిర్ ఇండియా సిఈవో క్యాంప్ బెల్ విల్స‌న్ కు ఏవియేష‌న్ డీజీసీఏ షోకాజ్ నోటీసు(DGCA Show Cause Notice) జారీ చేసింది.

ఎయిర్ లైన్స్ సేఫ్టీ , సెక్యూరిటీ , క్వాలిటీ ఫంక్ష‌న్స్ హెడ్ హెన్రీ డోనో హోకి కూడా నోటీసు జారీ చేసింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది డీజీసీఏకి ఫిర్యాదు చేయ‌డంతో స్పందించింది. ఈ మేర‌కు షోకాజ్ నోటీసు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న గ‌త ఫిబ్ర‌వరి 27న చోటు చేసుకుంది.

రెగ్యులేట‌ర్ భ‌ద్ర‌తా సూచ‌న‌ల‌ను ఉల్లంఘించినందుకు సంఘ‌ట‌న‌ను స‌కాలంలో డీజీసీఏకు నివేదించ‌నందుకు ఏప్రిల్ 21న ఎయిర్ ఇండియా సిఈవో, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ కు నోటీసు జారీ చేసిన‌ట్లు డీజీసీఏ అధికారి తెలిపారు.

Also Read : రెజ్ల‌ర్ల నిర‌స‌న వెనుక కుట్ర‌

Leave A Reply

Your Email Id will not be published!