Arvind Kejriwal : మోదీపై అర‌వింద్ కేజ్రీవాల్ గుస్సా

ఆప్ ను దెబ్బ తీసేందుకు పీఎం కుట్ర

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నిప్పులు చెరిగారు. బుధవారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరుతో ఆప్ ను దెబ్బ తీసేందుకు కుట్ర ప‌న్నారంటూ ఆరోపించారు.

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. చివ‌ర‌కు స‌త్య‌మే గెలుస్తుంద‌న్నారు. త‌మ పార్టీకి చెందిన ఎంపీలు సంజ‌య్ సింగ్ , రాఘ‌వ్ చద్దాల‌కు సంబంధించి ఎలాంటి ప్ర‌మేయం లేక పోయినా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ ఎలా పేర్లు చేరుస్తుందంటూ ప్ర‌శ్నించారు.

ఇదంతా కావాల‌ని కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ కుట్ర ప‌న్నుతోంద‌ని ఆరోపించారు. త‌మ ఎంపీలకు ఎలాంటి ప్ర‌మేయం లేక పోయినా మ‌నీష్ సిసోడియాతో క‌లిసిన వారిలో ఉన్నారంటూ పేర్కొన‌డం పూర్తిగా క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ఇలాంటి చ‌వ‌క‌బారు రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌లు, కేంద్రం , మోదీ , అమిత్ షా ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా ఆప్ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి ఈడీ కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో ఎంపీలు సంజ‌య్ సింగ్ , రాఘ‌వ్ చ‌ద్దాల‌ను చేర్చింది. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చింది. అయితే సీఎం దీని వెనుక పీఎం ఉన్నారంటూ ఆరోపించారు.

Also Read : అబ‌ద్దాలు చెప్ప‌డంలో మోదీ దిట్ట

Leave A Reply

Your Email Id will not be published!